అమ్మకాల సెగ, 200 పాయింట్ల పతనం

10 Dec, 2019 14:30 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ బలహీనత మరింత ముదిరి సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా కుప్పకూలింది.  రికార్డుర్యాలీ తరువాత  ఇన్వెస్టర్ల అమ్మకాలతో కీలక సూచీలు మద్దతు స్థాయిన దిగువకు చేరాయి.  ముఖ్యంగా మిడ్‌ సెషన్‌ నుంచి  పెరిగిన అమ్మకాలతో సెన్సెక్స్‌ 40300  దిగువకు,  నిఫ్టీ 11900 దిగువన ట్రేడ్‌ అవుతున్నాయి. 240 నష్టంతో 40243 వద్ద సెన్సెక్స్‌, నిఫ్టీ 79 పాయింట్ల  నష్టంతో 11861 వద్ద కొనసాగుతున్నాయి.  బ్యాంకింగ్‌, ఆయిల్‌ గ్యాస్‌ రంగాలు నష‍్టపోతున్నాయి. యస్‌ బ్యాంకు ఏకంగా 10శాతం నష్టపోయింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, గెయిల్‌,

భారతి ఇన్‌ఫ్రాటెల్‌,టీసీఎస్‌ బీపీసీఎల్‌ , ఎం అండ్‌ఎం  భారీగా నష్టపోతుండగా, హెచ్‌యూల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్టెల్‌, ఐసీఐసీఐ బ్యాంకు,కోటక్‌ మహీంద్ర, సన్‌ఫార్మ లాభపడుతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి డాలరుమారకంలో 10పైసల లాభంతో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు