వరస నష్టాలు : 200 పాయింట్ల పతనం

14 Jun, 2019 14:51 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి మరింత కిందికి దిగజారాయి. వరుసగా మూడోరోజు కూడా నష్టపోతోంది. రెండు వందలకుపైగా నష్టపోయిన సెన్సెక్స్‌ ప్రస్తుతం  166 పాయింట్లు క్షీణించి 39,577 వద్ద,  నిఫ్టీ 56 పాయింట్ల వెనకడుగుతో 11,858 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రియల్టీ, మీడియా, బ్యాంక్స్‌, ఫార్మా రంగాలు 2 శాతం క్షీణించగా,  మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ స్వల్పంగా 0.2 శాతం బలపడ్డాయి. మీడియా స్టాక్స్‌లో జీ, ఈరోస్‌, డిష్‌ టీవీ, నెట్‌వర్క్‌ 18, టీవీ టుడే, జాగరణ్‌ 5-1.5 శాతం నష్టపోతుండగా, రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, శోభా 4-1.3 శాతం మధ్య నీరసించాయి.  రిలయన్స్‌ కేపిటల్‌ ఏకంగా 7శాతం కుప్పకూలింది. దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, భారత్‌ ఫైనాన్స్‌, ఎస్కార్ట్స్‌ , ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌,  కొటక్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్‌,  జెట్‌ ఎయిర్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, వేదాంతా, గెయిల్‌ స్వల్పంగా లాభపడుతున్నాయి.

మరిన్ని వార్తలు