ముదిరిన ట్రేడ్‌ వార్‌ : మార్కెట్లు పతనం

19 Jun, 2018 16:13 IST|Sakshi

ముంబై : అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌ వార్‌ ముదరడంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ఢమాలమన్నాయి. గ్లోబల్‌గా వస్తున్న సంకేతాలతో, సెన్సెక్స్‌ 262 పాయింట్ల మేర కిందకి పడిపోయింది. దీంతో సెన్సెక్స్‌ 35,287 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 89 పాయింట్ల మేర క్షీణించి, 10,710.50 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెల్లువ పోటెత్తింది. హెచ్‌పీసీఎల్‌, యూపీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌, మారుతీ, టాటా మోటార్స్‌, ఎల్‌ అండ్‌ టీలు ఒత్తిడిలో కొనసాగగా.. గెయిల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు లాభాపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 220 పాయింట్లకు పైగా నష్ట పోయింది.

సీజీ వపర్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, సెయిల్‌, రెయిన్‌ ఇండస్ట్రీస్‌, ఎంఎన్‌డీసీ, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, సీఈఎస్‌సీ, ఇండియాబుల్స్‌ రియల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, టాటా గ్లోబల్‌, ఐజీఎల్‌, ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌లు 5 శాతం వరకు కిందకి పడిపోయాయి.అమెరికా- చైనా మధ్య వాణిజ్య వివాదం ముదరడంతో అటు చైనాతో సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ కూడా పతనమయ్యాయి. ఈ ప్రభావంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడటంతో డాలరుతో మారకంలో రూపాయి దాదాపు 4 వారాల కనిష్టం 68.33కు చేరింది.
 

మరిన్ని వార్తలు