భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు  

30 Sep, 2019 14:17 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంనుంచి బలహీనంగా సూచీలు  వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో  ఒక దశంలో సెన్సెక్స్‌ 400పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 11400 స్థాయిని కూడా కోల్పోయింది. మిడ్‌ సెషన్‌లో ప్రస్తుతం మెరుగు పడినప్పటికీ   ఊగిసలాట కొనసాగుతోంది.  ఆఖరి గంట కీలకం.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 302 పాయింట్లు కోల్పోయి 38520 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 11429 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ,ఫార్మ తప్ప​  అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. యస్‌బ్యాంకు, సిప్లా, వేదాంతా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, టాటా స్టీల్‌, హిందాల్కో ,సన్‌ఫార్మి, ఏషియన్‌ పెయింట్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌  నష్టపోతున్నాయి.  హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌,యూపిఎల్‌, బీపీసీఎల్‌ , యాక్సిస్‌ బ్యాంకు, టెక్‌మహీంద్ర, హీరో మోటా కార్ప్‌, రిలయన్స్‌, టైటన్‌ లాభపడుతున్నాయి.  మరోవైపు ఐఆర్‌సీటీసీ  ఐపీవో 30శాతం సబ్‌ స్కైబ్‌ అయింది.   ఈరోజు ( సోమవారం) మొదలైన  ఐపీవో అక్టోబర్‌ 3న ముగియనుంది. 

>
మరిన్ని వార్తలు