నష్టాల్లో సూచీలు: 10700 కిందికి నిఫ్టీ

15 Feb, 2019 09:59 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి.  అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో  వరుసగా మూడో రోజు కూడా  కీలక సూచీలు నష్టాల బాటపట్టాయి.  సెన్సెక్స్‌ 136పాయింట్లు క్షీణించి 35,734 కు చేరింది. నిఫ్టీ సైతం 51 పాయింట్ల వెనకడుగుతో 10694వద్ద కొనసాగుతోంది.

ఐటీ తప్ప అన్ని రంగాలూ నష్టాల్లోనే. ముఖ్యంగా ఫార్మా, మెటల్‌, ఆటో, బ్యాంకింగ్‌ సెక్టార్లు నష్టపోతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, జీ, హీరో మోటో, టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌, వేదాంతా, టైటన్‌, ఇన్‌ఫ్రాటెల్‌, సిప్లా టాప్‌ లూజర్స్‌గా ఉండగా, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, గెయిల్‌, ఐటీసీ లాభపడుతున్నాయి.

అటు రూపాయి కూడా బలహీనంగానే ఉంది. డాలరు, చమురు ధరల నేపథ్యంలో  దేశీయ కరెన్సీ నష్టాల్లో ఉంది.  డాలరు మారకంలో నిన్నటి ముగింపు 71.16తో పోలిస్తే, శుక్రవారం 71.23వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. 

మరిన్ని వార్తలు