చివరి గంట ట్రేడింగ్‌ : లాభాల్లోకి జంప్‌

16 Apr, 2018 15:57 IST|Sakshi

ముంబై : వరుసగా ఎనిమిది సెషన్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రారంభంలో ప్రతికూలంగా ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు, చివరికి పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 113 పాయింట్ల లాభంలో 34,305 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల లాభంలో 48 పాయింట్ల వద్ద ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో సిప్లా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌ 5 శాతం వరకు ర్యాలీ జరిపాయి. టాటా మోటార్స్‌ సుమారు 5 శాతం వరకు నష్టపోయింది. 

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ 2019 ఆర్థిక సంవత్సరానికి గాను ఈబీఐటీ మార్జిన్‌ గైడెన్స్‌ తగ్గించడంతో, ఆ కంపెనీ షేర్లు 3 శాతం మేర నష్టాలతో ముగిశాయి. విప్రో, ఎస్‌బీఐ, టెక్‌ మహింద్రా, భారతీ ఎయిర్‌టెల్‌లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి.  కానీ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 158 పాయింట్లు పైకి ఎగిసింది. చివరి గంట ట్రేడింగ్‌లో ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌ స్టాక్స్‌ గా హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ జరిపిన ర్యాలీతో మార్కెట్లు పైకి పుంజుకున్నట్టు తెలిసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు