లాభాల ముగింపు, 10600పైన నిఫ్టీ

15 Nov, 2018 16:16 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.  ఆరంభంనుంచి  ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు మద్దతు స్థాయిలకు ఎగువన స్థిరంగా ముగిసాయి. సెన్సెక్స్‌119 పాయింట్లు ఎగిసి 35,260 వద్ద ముగిసింది. నిఫ్టీ 40పాయింట్ల లాభంతో 10,616 వద్ద  స్థిరపడింది. అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌బ్యాంక్‌, హీరోమోటో, ఇన్ఫోసిస్‌, మారుతీ, ఎయిర్‌టెల్‌ టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి.  అలాగే అప్పుల ఊబిలో  మునిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను టాటా సన్స్‌ఆదుకోనుందన్నవార్తలతో ఏకంగా 26శాతం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ లాభపడింది.

నాన్‌ ఇండిపెండెంట్‌ ఎగ్జి‍క్యూటివ్‌ ఛైర్మన్‌ అశోక్‌ చావ్లా రిజైన్‌ చేయడంతో యస్‌ బ్యాంక్‌ ఢమాల్‌ అంది. ఇంకా గ్రాసిమ్‌, ఐబీ హౌసింగ్‌ అల్ట్రాటెక్‌, సన్‌ ఫార్మా, ఆర్‌ఐఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, గెయిల్‌, బీపీసీఎల్‌  నష్టపోయిన వాటిల్లోఉన్నాయి. అటు డాలరు మారకంలో రుపీ 24పైసలు పుంజుకుని 72.07 వద్ద ఉంది.  

మరిన్ని వార్తలు