3 వారాల గరిష్టం సెన్సెక్స్‌కు 184 ప్లస్

15 Aug, 2014 01:33 IST|Sakshi
3 వారాల గరిష్టం సెన్సెక్స్‌కు 184 ప్లస్

వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. తొలి నుంచీ లాభాలతో కదిలిన సెన్సెక్స్ 184 పాయింట్లు ఎగసింది. 26,103 వద్ద ముగిసింది. తద్వారా జూలై 30 తరువాత మళ్లీ 26,000 పాయింట్లను అధిగమించింది.  వెరసి నాలుగు రోజుల్లో 774 పాయింట్లను జమ చేసుకుంది. ఇక నిఫ్టీ కూడా 52 పాయింట్లు పుంజుకుని 7,792 వద్ద స్థిరపడింది.

ఇది మూడు వారాల గరిష్టంకాగా, బీఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. మెటల్స్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, పవర్, ఆయిల్ రంగాలు 1.5% స్థాయిలో బలపడ్డాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు పుంజుకోవడానికి షార్ట్ కవరింగ్ కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగాదేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. బుధవారం రూ. 718 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు గురువారం మరో రూ. 625 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

 నేడు మార్కెట్లకు సెలవు
 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(15న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఫారెక్స్, కమోడిటీ హోల్‌సేల్, ఫ్యూచర్స్‌తోపాటు బులియన్, మెటల్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.

మరిన్ని వార్తలు