ఆర్‌బీఐ బూస్ట్‌ :  రియల్టీ షేర్ల ర్యాలీ

6 Feb, 2020 13:13 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఆర్‌బీఐ పాలసీ విధానాన్ని  ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే దలాల్‌ స్ట్రీట్‌లో దీపావళి సందడి నెలకొంది. దాదాపు అన్ని రంగాలషేర్లు కొనుగోళ్లతో కళకళల్లాడాయి. సెన్సెక్స్‌ ఏకంగా 200 పాయింట్లు  ఎగియగా, నిఫ్టీ 60  పాయింట్లు  ఎగిసింది.  తద్వారా నిఫ్టీ 12150 స్థాయికి చేరింది. ఉదయం నుంచీ కీలక వడ్డీరేట్లపై  ఆర్‌బీఐ నిర్ణయంపై  ఆసక్తిగా ఎదురు చూసిన  ట్రేడర్లు, ఇన్వెస్లర్టు కొనుగోళ్లకు దిగారు.ముఖ్యంగా బ్యాంక్‌నిఫ్టీ భారీగా లాభపడింది.  అలాగే రియల్‌ ఎస్టేట్‌రంగానికి ఊతమిచ్చేలా ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకోవడంతో పిరామల్‌, ఇండియాబుల్స్‌  రియల్‌ ఎస్టే‍ట్‌ సంబంధిత షేర్లు పుంజుకున్నాయి.  ఆటో, ఆర్థిక రంగ షేర్లలో అనూహ్యంగా కొనుగోళ్లు పెరిగాయి. అలాగే ఫార్మా, మెటల్‌ ఇండెక్స్‌ లాభపడుతుండగా, ఒక్క ఎఫ్‌ఎంజీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, యస్‌బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జీ లిమిటెడ్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉండగా హిందాల్కో, బీపీసీఎల్‌, టైటాన్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటర్స్‌ షేర్లు  స్వల్పంగా నష్టపోతున్నాయి. కాగా ఆర్‌బీఐ పాలసీ రివ్యూలో రెపో రేటును 5.15 శాతంవద్ద, రివర్స్‌రెపో రేటును 4.90 శాతం వద్దే ఉంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.   

మరిన్ని వార్తలు