నష్టాలకు చెక్‌ : మళ్లీ లాభాల పంట

14 Aug, 2018 16:07 IST|Sakshi

ముంబై : బేర్‌కు బుల్‌ చెక్‌పెట్టింది. స్టాక్‌ మార్కెట్లను మళ్లీ లాభాల పంట పట్టించింది. రెండు రోజుల నష్టాలకు చెక్‌ పెట్టి, దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైన లాభంలో 37,852 వద్ద క్లోజ్‌ కాగ, నిఫ్టీ 79 పాయింట్ల లాభంలో 11,400 మార్కుకు పైన 11,435 వద్ద స్థిరపడింది. బ్యాంక్‌లు, ఫార్మాస్యూటికల్‌ షేర్లు పైకి జంప్‌ చేయడంతో మార్కెట్లు లాభాల పంట పండించినట్టు మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు. మరోవైపు జూలై నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల కనిష్టంలో 4.17 శాతం  వద్ద నమోదైంది. టర్కి లీరా భయాల నుంచి యూరప్‌, ఆసియా షేర్లు పునరుద్ధరించుకున్నాయి. దీంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. 

బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 1 శాతం మేర ఎగిసింది. బ్యాంక్‌లు, ఫార్మాస్యూటికల్స్‌తో పాటు ఆటోమొబైల్స్‌, ఎనర్జీ, ఐటీ షేర్లు కూడా లాభాల్లో నిలిచాయి. మిడ్‌క్యాప్స్‌ కూడా నేటి స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగియడానికి సహకరించాయి. సన్‌ ఫార్మా, యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు టాప్‌ గెయినర్లుగా నిలువగా.. యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, హిరో మోటోకార్ప్‌, ఎల్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌ టాప్‌ లూజర్లుగా నష్టాలు గడించాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం భారీగా పతనమైంది. ఆల్‌-టైమ్‌ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈక్విటీ బెంచ్‌ మార్కు సూచీలు ముగిసే సమయానికి రూపాయి విలువ 69.85 వద్ద ట్రేడవుతోంది.  

మరిన్ని వార్తలు