స్టాక్ మార్కెట్లో లాభాల పంట

9 May, 2016 18:20 IST|Sakshi

ముంబై : గత రెండు వారాల పాటు 3శాతం పతనమైన దేశీయ సూచీలు, ఈక్విటీ మార్కెట్ సపోర్టుతో సోమవారం ట్రేడింగ్ లో లాభాల ర్యాలీని కొనసాగించాయి. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 460.30 పాయింట్లు దూసుకెళ్లి 25688.86 వద్ద .. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 132.60 పాయింట్ల లాభాల్లో 7866.05 వద్ద క్లోజ్ అయ్యాయి. బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐటీసీ లాభాల్లో నడవగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, టాటా స్టీల్, గెయిల్ నష్టాలను నమోదుచేశాయి.

గత రెండు వారాలుగా క్షీణిస్తూ వస్తున్న స్టాక్ మార్కెట్లు ఐదు కారణాలతో లాభాలను పండించాయి. యూరోపియన్ స్టాక్ మార్కెట్లనుంచి వచ్చిన బలమైన ట్రేడింగ్ తో మార్కెట్లు దూసుకుపోయాయి. అంతేకాక బలహీనమైన పెరోల్ డేటాను అమెరికా విడుదలచేయడంతో, ఫెడ్ రిజర్వు బ్యాంకు జూన్ లో రేట్లు పెంచుతాదనే అవకాశం కొంత తగ్గడంతో అమ్మకాలకు బ్రేక్ పడింది.  ఆసియాలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ చైనా స్థిరత్వం పొందిందనే సంకేతాలు రావడం, ఆ దేశంలో ఆయిల్ కు డిమాండ్ పెరిగి, ఏప్రిల్ నెలలో ఆయిల్ దిగుమతలు 7.1శాతం ఎక్కువ నమోదుచేయడంతో మార్నింగ్ ట్రేడ్ లో క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్లకు బాగా సపోర్టునిచ్చాయి. దీంతో పాటు నాలుగో త్రైమాసిక ఫలితాలతో కొన్ని కంపెనీలు లాభాల్లో నడవడం, నిఫ్టీ50 ఇండెక్స్ 7800 మార్కు సైకాలాజికల్ ట్రెండ్ ను కొనసాగించడంతో మార్కెట్లు లాభాల్లో నడిచాయి.

మరిన్ని వార్తలు