లాభాల్లో ముగిసిన మార్కెట్లు

16 Nov, 2018 15:44 IST|Sakshi

సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి లాభాల్లో కొనసాగిన కీలక సూచీలు చివరివరకూ లాభాలను నిలబెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 197పాయింట్లు ఎగిసి 35,457వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 10,652 వద్ద ముగిసాయి. ప్రధానంగా ప్రభుత్వ బ్యాంక్స్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా  బలపడగా, మెటల్‌, రియల్టీ  నష్టపోయాయి.

ఎయిర్‌టెల్‌,  ఆర్‌ఐఎల్‌, ఐషర్, సిప్లా, బజాజ్ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి.  టాటా స్టీల్‌,   హెచ్‌పీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,  ఐబీ హసింగ్‌  టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  అటు డాలరు మారకంలో రుపీ పాజిటివ్‌గా ఉంది. 18పైసలు ఎగిసి 71.80 వద్ద ఉంది.

మరిన్ని వార్తలు