లాభాల్లో మార్కెట్లు: పార్మా జంప్‌

23 Feb, 2018 09:34 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు  లాభాలతో ప్రారంభమైనాయి.  అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్‌ 109 పాయింట్లక పైన లాభపడుతోంది.  నిప్టీ  37పాయింట్లు ఎగిసి 10,419 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి.  ముఖ్యంగా ఫార్మా,  ఐటీ, మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ  లాభపడుతున్నాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, అరబిందో, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్ర ,సిప్లా టా ప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి.   భారతి  ఇన్‌ప్రాటెల్‌,  ఎసియన్‌ పెయింట్స్‌, కాంకర్‌, ఎం అండ్‌ ఎం, గెయిల్‌ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు