100 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

17 Jul, 2018 10:09 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు ఫైల్‌ ఫోటో

ముంబై : మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా పెరుగగా... నిఫ్టీ 10,950కి పైకి జంప్‌ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 108 పాయింట్ల లాభంలో 36431 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంలో 10,977 వద్ద ట్రేడవుతున్నాయి. అన్ని రంగాల సూచీలు ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్నాయి.

మిడ్‌క్యాప్స్‌ కూడా బలంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఒక శాతం మేర జంప్‌ చేసింది. టాప్‌ గెయినర్లుగా టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ లాభాలు పండించగా.. హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ ఎక్కువగా నష్టపోతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు బలపడి 68.39 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు