36వేల స్థాయిని తాకిన సెన్సెక్స్‌

13 Dec, 2018 13:04 IST|Sakshi

36వేల  మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

10800 ఎగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల డబుల్‌ సెంచరీతో హుషారుగా ప్రారంభమై, మరింత పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 36వేల మార్క్‌ను అధిగమించింది. నిఫ్టీ కూడా 10800 ఎగువకు చేరింది. సెన్సెక్స్‌ ప్రస్తుతం 212 పాయింట్లు ఎగసి 35,991, వద్ద నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 10,802 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లు పుంజుకోవడంతో ప్రోత్సాహం లభించిన ఇన్వెస్టర్లు వరుసగా మూడో రోజు కొనుగోళ్లకే మొగ్గు చూపారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలకు తెరపడే పరిస్థితులు నెలకొనడం, యూకే ప్రధాని థెరెసా మే విశ్వాసపరీక్షను గెలవడం లాంటి సానుకూల అంశాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్‌ లాభపడుతుండగా మెటల్‌ స్వల్పంగా నష్టపోతోంది.  ఐబీ హౌసింగ్‌ 8.5 శాతం లాభపడి టాప​ గెయినర్‌గా ఉంది. ఇంకా హెచ్‌పీసీఎల్‌, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌, మారుతీ, జీ 2-1.2 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క యూపీఎల్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, సిప్లా, అదానీ పోర్ట్స్‌, ఐషర్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఇన్‌ఫ్రాటెల్ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

అటు డాలరు మారకంలో  దేశీయ కరెన్సీ రూపాయి  బాగా బలపడింది. 48పైసలు ఎగిసి 71.53 వద్ద కొనసాగుతోంది.
 

>
మరిన్ని వార్తలు