మార్కెట్లో జోష్ ‌: 11వేల దిశగా నిఫ్టీ

21 Jan, 2019 14:05 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్ల  కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఆరంభంలో ఫ్లాట్‌గా మార్కెట్లు, దాదాపు డబుల్‌ సెంచరీ లాభాలకు పైగా సాధించాయి. అటు నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయి దిశగా కదులుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 243పాయింట్లు ఎగసి 36,629వద్ద, నిఫ్టీ 60 పాయింట్లలాభంతో 10,962 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ ఇన్వెస్టర్లను ఆందోళనకు  గురిచేస్తున్న వాణిజ్య వివాదాలకు చెక్‌ పడనున్న అంచనాలతో  దేశీయంగా సెంటిమెంటుకు జోష్‌ వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రధానంగా ఫార్మా, ఐటీ , ఎఫ్‌ఎంసీజీ  లాభాలు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. కాగా.. విప్రో, బజాజ్‌ ఆటో, హీరోమోటో, పవర్‌గ్రిడ్‌, ఐబీ హౌసింగ్‌, కొటక్‌ బ్యాంక్‌, జీ, ఇన్‌ఫ్రాటెల్‌, మారుతీ, ఐవోసీ  నష్టపోతున్నాయి.
 

మరిన్ని వార్తలు