ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌ : రాకేష్‌ ప్రశంసలు 

23 May, 2019 12:42 IST|Sakshi

సాక్షి, ముంబై : కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్వంలో మళ్లీ రెండోసారి సర్కార్‌ కొలువు దీరనున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్‌, నిప్టీ అల్‌ టైం రికార్డు స్థాయిలను తాకాయి. తొలిసారిగా సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల కీలక మార్క్‌ను దాటేసింది. వెరసి మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి.

దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 289 పాయింట్ల లాభాలకు పరిమితమై 39,405, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 11829 వద్ద ట్రేడవుతోంది. అత్యధిక స్థాయిల్లో ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు క్యూకట్టడంతో స్టాక్‌ మార్కెట్‌ హైనుంచి వెనక్కి తగ్గింది.

మరోవైపు మార్కెట్‌ గురు, పెట్టుబడిదారుడు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కేంద్రంలో బీజేపీ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆశ్రిత పెట్టుబడి విధానానికి (క్రోనీ క్యాపిటలిజం) మరణ శాసనమనీ, ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌కు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, మోదీ నేతృత్వంలో దేశ ఆర్థిక రంగం మరింత వృద్దిని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు