ఆల్‌-టైమ్‌ హైని తాకిన సెన్సెక్స్‌

24 Jul, 2018 10:21 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్ల జోరు (ప్రతీకాత్మక చిత్రం)

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కూడా సరికొత్త ఆల్‌-టైమ్‌ గరిష్ట స్థాయిలను తాకాయి. సెన్సెక్స్‌ 36,869 వద్ద ఈ గరిష్ట స్థాయిలను చేరుకోగా.. నిఫ్టీ 11,113 పాయింట్లను అధిగమించేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 144 పాయింట్ల లాభంలో 36,863 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల లాభంలో 11,131 వద్ద గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఎనర్జీ, సిమెంట్‌ స్టాక్స్‌ జోరుతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డు జోరు కొనసాగిస్తున్నాయి.

సిమెంట్‌  స్టాక్స్‌ ఏసీసీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిమ్‌ టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. ఐడియా సెల్యులార్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐలు ఇతర టాప్‌ గెయినర్లుగా లాభాలు పండిస్తున్నాయి. ప్రారంభ గంటలోనే ఏసీసీ 10 శాతానికి పైగా జంప్‌ చేసింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే నడుస్తున్నాయి. ఎక్కువగా ఐటీ, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ షేర్లు ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాయి. దేశీయంగా సెంటిమెంట్‌ బలపడిన కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ జోరును కొనసాగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు