సెన్సెక్స్‌ మరో రికార్డు

17 Jul, 2017 12:29 IST|Sakshi

ముంబై:  దలాల్‌ స్ట్రీట్‌ లో రికార్డుల వర్షం  కొనసాగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడం,గ్లోబల్‌ మార్కెట్లు సానుకూల ధోరణి నేపథ్యంలో  స్టాక్‌ మార్కెట్లు కొత్త గరిష్టాలను అందుకున్నాయి.  దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వడంతో అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 32,132 వద్ద, నిఫ్టీ 9,920 వద్ద ఆల్‌టైమ్‌ 'హై' లను నమోదు చేశాయి. దీంతోపాటు డాలర్‌ మారకంలో  రూపాయి, బంగారం ధరలు కూడా  పాజిటివ్‌ నోట్‌తో లాభాలతో ట్రేడ్‌ అవుతూ వుండటం విశేషం.

అటు  బ్యాంక్‌ నిఫ్టీ సైతం 71 పాయింట్లు ఎగసి 24,009ని అధిగమించింది.   అంతేకాదు మార్కెట్‌ లీడర్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా మార్కెట్‌ క్యాప్‌ లో రూ. 5లక్షల కోట్లను  క్రాస్‌ చేసింది.  ఐటీ 1.4 శాతం, మెటల్‌ 0.9 శాతం, ఆటో 0.5 శాతం చొప్పున  లాభపడ్డాయి.

మరోవైపు టుబాకో పై జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం  నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ  బలహీనంగా ఉంది. ముఖ్యంగా ఐటీసీ 3శాతం  నష్టపోయింది. దీంతో మార్కెట్లు కొద్దిగా వెనుకంజలో ఉన్నాయి. విప్రో, వేదాంతా, అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభపడుతుండగా, ఐటీసీ, గెయిల్‌, ఐవోసీ, యాక్సిస్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, హెచ్‌యూఎల్‌, అరబిందో నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి 0.09 పైసల లాభంతో రూ. 64.36వద్ద, పసిడి రూ.41 పుంజుకుని పది గ్రా. రూ.28,037 వద్ద కొనసాగుతోంది. 



 

మరిన్ని వార్తలు