చమురు ఎఫెక్ట్‌ : సెన్సెక్స్‌ 875 పాయింట్లు జంప్‌

4 Feb, 2020 14:35 IST|Sakshi

సాక్షి, ముంబై:  దలాల్‌ స్ట్రీట్‌ మంగళవారం  భారీ లాభాలతో  దూసుకుపోతోంది. బడ్జెట్‌  రోజు  దాదాపు వెయ్యి పాయింట్లు దాకా కుప్పకూలిన సూచీలు  నేడు బాగా పుంజుకున్నాయి. ఆరంభంనుంచి పాజిటివ్‌గా ఉన్న సెన్సెక్స్‌ రోజంతా భారీ లాభాలతో ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం 875 పాయింట్లు ఎగిసి 40747 వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు ఎగిసి 11968 వద్ద స్థిరంగా  కొనసాగుతోంది. టెలికాం ఇండెక్స్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో ఉన్నాయి. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి, ఆయిల్, మెటల్ రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్, ఐటీసీ, హీరో మోటోకార్ప్ లాంటి హెవీవెయిట్స్ ఇండెక్స్ లాభాలు మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి. అలాగే ఫలితాలు మెరుగ్గా ఉండటంతో భారతి ఎయిర్‌టెల్ బాగా పుంజుకుని లాభాల్లోకి మళ్లింది. బజాజ్ ఆటో, హిందుస్తాన్ యూనిలీవర్   నష్టాల్లో ఉన్నాయి.

ఆసియా మార్కెట్లో స్థిరత్వం, ముడి చమురు ధరల తగ్గుదల కారణంగా బలంగా ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తితో చైనా డిమాండ్‌ తగ్గి, ఒపెక్ సరఫరా సరఫరా కోతలకు కారణమవుతుండటంతో బ్రెంట్ ముడి చమురు 2.17 డాలర్లు లేదా 3.8 శాతం క్షీణించి బ్యారెల్ 54.45 డాలర్లకు చేరుకుంది.  తద్వారా 13 నెలల కనిష్టాన్ని తాకింది. మరోవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా, ఫిబ్రవరి 6న సెంట్రల్ బ్యాంక్ రెపో రేట్ ను యథాతథ స్థితినే కొనసాగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు