బ్రెగ్జిట్ ఫలితానికై ఎదురు చూస్తున్న మార్కెట్లు

23 Jun, 2016 11:13 IST|Sakshi

ముంబై:  గురువారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి.  బీఎస్సీ సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో  మొదలైన సెన్సెక్స్ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి.  బ్రెగ్జిట్ రెఫరండం  ఫలితాలకోసం ప్రపంచ మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు వెయిట్ అండ్ వాచ్  ధోరణిలోనే ట్రేడవుతున్నాయి. దీంతో  3  పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్ 26,763 దగ్గర ఉండగా, నిఫ్టీ 7 పాయింట్ల  నష్టంతో  8196 దగ్గర    ఉంది.  ఎఫ్ ఎంసీజీ, , బ్యాంకింగ్, బెటల్,  హెల్త్  కేర్ ఆటో రంగాలు పాజిటివ్ గా ఉన్నాయి.   బ్రెగ్జిట్ అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బ్రెగ్జిట్ పరిణామాలను గమనిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.  ఆర్థిక మార్కెట్లలో సక్రమమైన పరిస్థితులు నిర్ధారించడానికి ద్రవ్యత మద్దతు సహా అవసరమైన చర్యలను తీసుకుంటామని తెలిపింది. మరోవైపు  సెబీ మరియు స్టాక్ ఎక్సేంజ్   బ్రెగ్జిట్  ఫలితంపై  ఆత్రుతతో పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్న   ఎలాంటి అస్థిరతనైనా  పరిష్కరించేందుకు వీలుగా  నిఘా యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేశారు . ఆసియా , హాంగ్ కాంగ్ తదితర మార్కెట్లు  కూడా నెగిటివ్ గాఉన్నాయి.

అటు  అమెరికా కరెన్సీ డాలర్  తో పోలిస్తే రూపాయ పాజిటివ్ గా ఉంది. 15  పైసల కోలుకొని  67.33 దగ్గర ఉండగా,  బులియన్ మార్కెట్ కూడా నెగిటివ్ గానే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి 100 రూ. నష్టపోయి రూ. 30, 006 దగ్గర   ఉంది.
 

మరిన్ని వార్తలు