ఎట్టకేలకు నష్టాలకు బ్రేక్‌: మార్కెట్‌ జంప్‌

24 Oct, 2018 15:51 IST|Sakshi

సాక్షి, ముంబై: రోజంతా తీవ్ర ఒడిదుడుకులతో లాభనష్టాల మధ్య కదలాడిని స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌ 187 పాయింట్లు పుంజుకుని 34033 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు జంప్‌ చేసి 10224 వద్ద ముగిసాయి. కీలక సూచీలు రెండూ మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ముగియడం విశేషం.  ముఖ్యంగా ఆయిల్‌ ధరలు  కిందికి రావడంతో చివరి  గంటలో  కొనుగోళ్లు పుంజుకున్నాయి.

రియల్టీ బ్యాంక్‌ నిఫ్టీ లాభాలు మార్కెట్లను లీడ్‌ చేయగా మీడియా, ఫార్మా నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, హిందాల్కో టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐబీ హౌసింగ్‌ కూడా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. బజాజ్‌ఆటో, ఎస్‌బ్యాంకు, డీఆర్‌ఎల్‌, గ్రాసింగ్‌ అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌ బాగా నష్టపోయాయి. అంబుజా, ఎన్‌టీపీసీ, జీ, ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, కొటక్‌ బ్యాంక్‌ నష్టపోయిన ఇతర షేర్లు.

మరిన్ని వార్తలు