లాభాల ముగింపు : ఆర్‌ఐఎల్‌ 4శాతం జంప్‌

21 Jan, 2019 17:27 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గినా వరుసగా ఐదవ సెషన్లో కీలక సూచీలు  లాభాల దౌడు తీశాయి. ఒక దశలో 295 పాయింట్ల వరకు ఎగిసిన  సెన్సెక్స్‌ చివరకు 192 పాయింట్ల లాభాలతో 36,578 వద్ద , నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 10,961 ముగిసింది.  11వేల స్థాయి సమీపంలో ముగిసింది. ఐటీ,  ఆయిల్‌ అండ్‌గ్యాస్‌, ఫార్మ షేర్లు లాభపడ్డాయి.   రియల్టీ,ఆ టో,పీ ఎస్‌యూ బ్యాంక్స్‌ షేర్లు నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4 శాతం లాభపడింది. కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉండగా  హీరోమోటో, యస్‌ బ్యాంక్‌, విప్రో, మారుతీ, బజాజ్‌ ఆటో, ఐబీ హౌసింగ్‌, ఐవోసీ, గ్రాసిమ్‌, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ  నష్టపోయినవాటిల్లో ఉన్నాయి.

మరోవైపు దేశీయ కరెన్సీ రుపీ  నష్టాల్లో ముగిసింది. 12పైసలు నష్టపోయి 71.28 వద్ద స్థిరపడింది.  బ్రెంట్‌ క్రూడ్‌  బ్యారెల్‌కు 62.94 వద్ద రెండు నెలల గరిష్టాన్ని తాకింది.  దీంతో రుపాయి బలహీనపడింది.

మరిన్ని వార్తలు