బుల్‌ రన్‌ : వెయ్యి పాయింట్లు అప్‌

20 May, 2019 12:16 IST|Sakshi

సాక్షి, ముంబై : కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారుకు స్పష్టమైన మెజారిటీ సాధించనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్‌ రంకెలేస్తోంది. ఆరంభం జోరును మరింత కొనసాగిస్తూ  సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ కూడా ఇదే హైజంప్ చేసింది.  తద్వారా నిఫ్టీ 11700 స్థాయిని  అధిగమించింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో సెన్సెక్స్‌ 10045 పాయింట్లు దూసుకెళ్లి 38,972 కు చేరింది. నిఫ్టీ సైతం 307 పాయింట్లు ఎగసింది. 11716 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. 

అన్ని రంగాలూ లాభాల్లోనే. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 4.5 శాతం, రియల్టీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌, ఆటో 3-2 శాతం మధ్య లాభపడుతున్నాయి.  ఐబీ హౌసింగ్‌, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఐవోసీ, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్ 5-3.5 శాతం మధ్య ఎగశాయి. రిలయన్స్‌  హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాభాలు మార్కెట్లకుమద్దతునిస్తున్నాయి.  అయితే జీ 3.5 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 3 శాతం, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ 1.5 శాతం చొప్పున డీలాపడ్డాయి.  ఆరంభంలోనే బలహీనంగా ఐటీ కూడా భారీగా పుంజుకుంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. దీంతో టీసీఎస్‌ 2శాతం ఎ గియగా, ఇ‍న్ఫీ నష్టాల నుంచి భారీగా కోలుకుంది. 

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌లో కెనరా, సిండికేట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ, ఓబీసీ, బీవోబీ, ఇండియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌, యూనియన్‌, సెంట్రల్‌, జేఅండ్‌కే బ్యాంక్‌ 5.25-2.25 శాతం మధ్య లాభపడ్డాయి. రియల్టీ కౌంటర్లలో శోభా, సన్‌టెక్‌, ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌, ప్రెస్టేజ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బ్రిగేడ్‌, ఫీనిక్స్‌, ఒబెరాయ్‌, మహీంద్రా లైఫ్‌ 6.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి.

మరిన్ని వార్తలు