నష్టాలకు చెక్‌ : లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

19 Sep, 2018 10:34 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు (ప్రతీకాత్మక చిత్రం)

ముంబై : ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. తద్వారా రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 85 పాయింట్లు పెరిగి 37,376కు చేరింది. నిఫ్టీ సైతం 28 పాయింట్లు బలపడి 11,300 పైన 11,306 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, మెటల్‌ రంగాలు 1.3 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఆటో 0.5 శాతం బలపడింది. 

ట్రేడింగ్‌ ప్రారంభంలో కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, యస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ లాభాలు పండించగా...  హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నష్టాలు గడిస్తున్నాయి. మిడ్‌క్యాప్‌ 0.5 శాతం లాభాలు పండించింది. ఈ నెల 24 నుంచీ 200 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలను విధిస్తున్నట్లు అమెరికన్‌ ప్రభుత్వం ప్రకటించగా.. 67 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ ప్రొడక్టులపై 10 శాతం టారిఫ్‌ల ప్రకటన యోచనలో ఉన్నట్లు చైనా ప్రభుత్వం తాజాగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనూ అమెరికాసహా ఆసియా వరకూ ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బలపడటం విశేషం! 
 

మరిన్ని వార్తలు