లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

31 May, 2018 10:02 IST|Sakshi

ముంబై : గ్లోబల్‌గా సెంటిమెంట్‌ బలపడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లు జంప్‌ చేసింది. ప్రస్తుతం 100 పాయింట్లు లాభంలో 35,006 వద్ద.. నిఫ్టీ 27 పాయింట్ల లాభంలో 10,641 వద్ద ట్రేడవుతోంది. బుధవారం అమెరికా మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లూ సానుకూల ధోరణిలో కొనసాగుతున్నాయి.

అయితే నేడు డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా మార్కెట్లకు ఒడిదొడుకులు ఎదురుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ అత్యధికంగా 1 శాతం లాభపడగా.. ఫార్మా, రియల్టీ 0.3 శాతంపైగా పుంజుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ మార్కెట్లకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, టీసీఎస్‌లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు