భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

14 Oct, 2019 14:21 IST|Sakshi

సాక్షి, ముంబై:   దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ అమెరికా, చైనా పాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తొలుత  150 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్‌ 38,287 వద్ద గరిష్టాన్ని తాకింది. తదుపరి ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో 200 పాయింట్ల వరకూ నష్టాలలోకి సైతం ప్రవేశించింది.  ప్రస్తుతం ఏకంగా 333 పాయింట్లు ఎగిసి 38,475 వద్ద,  నిఫ్టీ ప్రస్తుతం 104 పాయింట్లు  లాభంతో 11,408 వద్ద ట్రేడవుతోంది.  దాదాపు అన్ని షేర్లు లాభపడుతున్నాయి. ప్రధానంగా మెటల్‌, ఫార్మా,రియల్టీ,  లాభపడుతుండగా, ఐటీ నష్టపోతోంది.  టాటా మోటార్స్‌, వేదాంతా, ఐవోసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ భారీగా లాభపడుతుండగా, ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌, టీసీఎస్‌, జీ, హీరో మోటో, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా  నష్టపోతున్నాయి.

మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) బంపర్‌ లిస్టింగ్‌ సాధించింది. ఇష్యూ ధర రూ. 320కాగా..  బీఎస్‌ఈలో 103 శాతం ప్రీమియంతో రూ. 651 వద్ద ట్రేడిం

మరిన్ని వార్తలు