లాభాల జోరు : ట్రిపుల్‌ సెంచరీ

27 May, 2019 15:26 IST|Sakshi

సాక్షి, ముంబై :  కేంద్రంలో  స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపత్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలడపడింది. దీంతో స్టాక్‌మార్కెట్లు దూకుడును ప్రదర్శించి 350 పాయింట్లకు పైగా లాభపడింది.  ప్రస్తుతం  సెన్సెక్స్‌ 216పాయింట్లు ఎగసి 39,656 వద్ద, నిఫ్టీ సైతం 71పాయింట్లు బలపడి 11,915 వద్ద ట్రేడవుతోంది. తొలుత ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమయ్యాయి. తదుపరి జోరందుకున్నాయి. 

రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌ 2 శాతం చొప్పున పుంజుకోగా మెటల్‌ 1.7 శాతం ఎగసింది. రియల్టీ స్టాక్స్‌లో  ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, శోభా, మహీంద్రా లైఫ్‌, ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌5.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇక నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, ఎన్‌టీపీసీ, యస్ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, ఎంఅండ్‌ఎం 5-2 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ, ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, ఆర్‌ఐఎల్‌, విప్రో 2-0.6 శాతం మధ్య క్షీణించాయి.

మరిన్ని వార్తలు