మార్కెట్లు 400 పాయింట్లు జంప్‌

15 Oct, 2019 14:41 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన ప్రస్తుతం సెన్సెక్స్‌  400 పాయింట్లు జంప్‌ చేసింది.  నిఫ్టీ కూడా ఇదేబాటలో 120 పాయింట్లు ఎగిసి పటిష్టంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 38,600 స్థాయిని అధిగమించగా, నిఫ్టీ సైతం 11500 దిశగా కదులుతోంది. ప్రధానంగా అమెరికా చైనా ట్రేడ్‌వార్‌ చెక్‌పనున్న సంకేతాలతో దలాల్‌ స్ట్రీట్‌ సానుకూలంగా ఉంది.

ప్రధానంగా ఆటో, మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా లాభపడుతుండగా, మెటల్‌, ఐటీ స్వల్పంగా నష్టపోతున్నాయి. ఐషర్‌, జీ, హీరో మోటో, మారుతీ, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, ఐవోసీ, హెచ్‌యూఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ లాభపడుతుండగా,  జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, టాటా స్టీల్‌, ఇన్ఫ్రాటెల్, నెస్లే, వేదాంతా, హిందాల్కో  నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు