కొనసాగుతున్న జోష్‌, 38 వేల ఎగువకు సెన్సెక్స్‌

15 Mar, 2019 14:41 IST|Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లలో సార్వత్రిక ఎన్నికల జోష్‌ కొనసాగుతోంది.  వరుస లాభాలకు నిన్న కొద్దిగా విరామం  తాసుకున్న సూచీలు  తిరగి శుక్రవారం మరింతగా పుంజుకున్నాయి. భారీ లాభాలతో సెన్సెక్స్‌  38వేలకు ఈజీగా అధిగమించింది. మిడ్‌సెషన్‌ తరువాత మరింత ఎగిసి  సెన్సెక్స్‌450 పాయింట్లు జంప్‌చేసి 38,206కు చేరగా.. నిఫ్టీ 134 పాయింట్లు ఎగసి 11,476 వద్ద ట్రేడవుతోంది. 

ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1.5 శాతం చొప్పున ఎగశాయి. మీడియా 2 శాతం పుంజుకోగా.. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ 0.9-0.6 శాతం చొప్పున బలహీనపడ్డాయి. మీడియా కౌంటర్లలో యుఫో, జీ, సన్‌ టీవీ, ఈరోస్‌, డిష్‌ టీవీ, డెన్‌, పీవీఆర్, జీ మీడియా 3.5-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. 

ఇంకా నిఫ్టీ దిగ్గజాలలో కొటక్‌ బ్యాంక్‌, ఐవోసీ, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, విప్రో, ఇండస్‌ఇండ్, ఎన్‌టీపీసీ 4.5-1.5 శాతం మధ్య లాభపడుతుండగా,  ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, యస్‌బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, వేదాంతా, ఇన్‌ఫ్రాటెల్‌,  ఐటీసీ   నష్టపోతున్నాయి. 
 

మరిన్ని వార్తలు