మరింత నీరసించిన స్టాక్‌మార్కెట్లు

4 Dec, 2018 13:52 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు మరింత బలహీనపడ్డాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 138 పాయింట్లు క్షీణించి 36,103 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 10,856 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు  కూడా బలహీనంగానే కదులుతున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల పరిష్కారానికి విధించుకున్న మూడు నెలల గడువులోగా ఒప్పందం కుదిరే అంశంపై ఇన్వెస్టర్లలో తాజాగా సందేహాలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఐటీ, ఫార్మా లాభపడుతుండగా బ్యాంక్‌ నిఫ్టీ, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ నష్టపోతున్నాయి. అమెరికా పేటెంట్‌ పొందిన వార్తలతో యూఫ్లెక్స్‌ 7 శాతం ఎగిసింది.  ఆర్‌కాం  ఈ రోజు కూడా మరో ఎనిమిది శాతం లాభపడింది. అయితే ఎం అండ్‌ ఎండ్‌ భారీ నష్టాలతో టాప్‌ లూజర్‌గా ఉంది.  ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌, మారుతీ, యాక్సిస్‌, అదానీ పోర్ట్స్‌ 2.6-0.8 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు  యూపీఎల్‌, ఐబీ హౌసింగ్‌ దాదాపు 3 శాతం చొప్పున పుంజుకోగా.. ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, బీపీసీఎల్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో 3-1.5 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు