మూడురోజుల లాభాలకు బ్రేక్‌: పీఎస్‌యూ బ్యాంక్స్‌ డౌన్‌

29 May, 2018 16:00 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి దేశీయంగా ఇన్వెస్టర్లను  సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో మూడు రోజుల ర్యాలీకి చెక్‌ చెప్పిన కీలక సూచీ సెన్సెక్స్‌ 216 పాయింట్లు పతనమై 35వేలకు దిగువన  34,949 వద్ద , నిఫ్టీ  55 పాయింట్లు క్షీణించి 1,633 వద్ద  ముగిసింది. ఐటీ, ఆటో లాభపడగా,   పీఎస్‌యూ బ్యాంక్స్‌  భారీగా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా, రియల్టీ సెక్టార్‌ బలహీనంగా  ముగిసింది.  ఐసీఐసీఐ 3శాతానికిపైగా,  ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌, జీ, యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్, సిప్లా  నష్టపోగా, ఫలితాల ప్రభావంతో ఎంఅండ్‌ఎం లాభపడింది. దీంతోపాటు  గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎయిర్‌టెల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హీరోమోటో లాభాల్లో ముగిసాయి.  
 

మరిన్ని వార్తలు