నిఫ్టీ... ‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

21 Jul, 2017 01:01 IST|Sakshi
నిఫ్టీ... ‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవారికి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్‌ అండ్‌ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్‌? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. ఆ ‘ఫ్యూచర్‌ సిగ్నల్స్‌’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...

నిఫ్టీ:
ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ–50 మూడురోజులుగా 9.900 పాయింట్ల స్థాయికి అటూ, ఇటూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నది. ఈ నెలలో నిఫ్టీ 10,000 పాయింట్ల శిఖరాన్ని చేరవచ్చన్న అంచనాలు  కొద్దిరోజుల క్రితం వరకూ మార్కెట్లో ఉన్నా, ఈ స్థాయిని తక్షణమే అందుకోకపోవచ్చన్న భావన ట్రేడర్లలో ప్రస్తుతం ఏర్పడుతున్నట్లుంది. ఇందుకు సంకేతంగా 10,000 స్ట్రయి క్‌ వద్ద కాల్‌రైటింగ్‌ గురువారం జోరందుకుంది. ఈ స్ట్రయిక్‌ వద్ద తాజాగా 13.42 లక్షల షేర్లు యాడ్‌కావడంతో కాల్‌ బిల్డప్‌ 70.87 లక్షల షేర్లకు చేరింది. 9,900 స్ట్రయిక్‌ వద్దసైతం తాజా కాల్‌రైటింగ్‌ ఫలితంగా 9.09 లక్షల షేర్లు యాడ్‌ అయ్యాయి. ఇక్కడ కాల్‌ బిల్డప్‌ 51.81 లక్షల షేర్లకు పెరిగింది. ఇదే స్ట్రయిక్‌ వద్ద పుట్‌ కవరింగ్‌ కారణంగా పుట్స్‌ ఓఐ నుంచి 3.48 లక్షల షేర్లు కట్‌ అయ్యాయి.

పుట్‌ బిల్డప్‌ 39 లక్షలకు తగ్గింది. 9,800 స్ట్రయిక్‌ వద్ద స్వల్పంగా పుట్‌ కవరింగ్‌ జరగడంతో ఇక్కడ బిల్డప్‌ 64.97 లక్షలకు దిగింది. ఇక నిఫ్టీ ఫ్యూచర్స్‌ ఓఐ నుంచి గురువారం 2.44 లక్షల షేర్లు (1.32%) తగ్గాయి. నిఫ్టీ ఫ్యూచర్‌ ఓఐ నుంచి షేర్లు కట్‌కావడం వరుసగా ఇది మూడో రోజు. ఇలా వరుసగా ఓఐ తగ్గడం...అటు షార్ట్స్, ఇటు లాంగ్స్‌ను ట్రేడర్లు స్క్వేర్‌ఆఫ్‌ చేసుకోవడాన్ని సూచిస్తున్నది. అలాగే సమీప భవిష్యత్తులో 9,800–10,000 పాయింట్ల శ్రేణి మధ్య నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఆప్షన్‌ డేటా విశ్లేషిస్తున్నది.

కొటక్‌ ఫ్యూచర్‌ సంకేతాలెలా ఉన్నాయి?
కెనరా బ్యాంక్‌ డేటా ఏం చెబుతోంది?
ఈ వివరాలు www.sakshibusiness.com లో

మరిన్ని వార్తలు