స్టాక్‌మార్కెట్ల భారీ పతనం

17 Sep, 2018 17:45 IST|Sakshi

సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు సోమవారం బేర్‌ మన్నాయి. అమెరికా, చైనా  ట్రేడ్‌వార్‌ మళ్లీ తెరమీదకు రావడంతో దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలహీనపడింది.  భారీ అమ్మకాలతో గత రెండు సెషన్లలో  గడించిన లాభాలను  కోల్పోయింది.ఇతర ఆసియా మార్కెట్లలో బలహీనమైన ధోరణి   నేపథ్యంలో చివరికి సెన్సెక్స్‌ 505 పాయింట్లు కోల్పోయి 37,585 వద్ద,  నిఫ్టీ 137 పాయింట్లు దిగజారి 11,378 వద్ద స్థిరపడింది. రూ పాయి పతనానికి  చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వ ప్రకటన కూడా రూపాయికి బలాన్నివ్వలేదు. డాలరుతో మారకంలో రూపాయి కూడా ఇదే బాట పట్టింది.

ఫార్మా, బ్యాంకింగ్‌,  ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఆటో బలహీనపడగా,  రియల్టీ స్వల్ప లాభంతో  ముగిసింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టైటన్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్‌, ఐబీహౌసింగ్, ఏషియన్‌ పెయింట్స్‌  నష్టపోయాయి.. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, టెక్‌ మహీంద్రా, ఐషర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌  లాభాల్లో ముగిసాయి.

200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనీస్‌ దిగుమతులపై టారిఫ్‌ల విధింపునకు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్   సిద్ధమవుతున్నారన్న అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి.  రూ ప్రభుత్వ చర్యలు  దలాల్‌ స్ట్రీట్ అంచనాలను అందుకోలేదని విశ్లేషకులు చెప్పారు.

మరిన్ని వార్తలు