గరిష్టాల వద్ద అమ్మకాలు

22 May, 2019 00:47 IST|Sakshi

383 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌నిఫ్టీ 119 పాయింట్లు డౌన్‌

ఇంట్రాడేలో రికార్డు స్థాయిలకు సూచీలు

ఫలితాలకు ముందు అప్రమత్తత 

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అసలైన ఫలితాలు రావడానికి రెండు రోజులు ముందే ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పిన అంచనాల దన్నుతో మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిల్లో (మూడు శాతానికి పైగా) లాభపడి గరిష్ట స్థాయిలకు చేరిన విషయం తెలిసిందే. దీంతో అధిక ధరల వద్ద లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 383 పాయింట్లు (0.97 శాతం) నష్టపోయి 38,969.80 వద్ద ముగియగా, అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం క్రితం రోజుతో పోలిస్తే 119 పాయింట్లు (ఒక శాతం) క్షీణించి  11,709 వద్ద స్థిరపడింది. సోమవారం నిఫ్టీ 421 పాయింట్లు, సెన్సెక్స్‌ 1,422 పాయింట్లు చొప్పున పెరిగిన విషయం గమనార్హం. శాతం వారీగా చూస్తే ఆరేళ్లలోనే ఒక రోజులో అత్యధికంగా పెరిగినట్టు లెక్క. మంగళవారం ఆరంభంలో మార్కెట్లు సానుకూలంగానే ట్రేడ్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ అయితే ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 39,571.73 వరకు వెళ్లింది. నిఫ్టీ సైతం రికార్డు గరిష్ట స్థాయి 11,883.55ను నమోదు చేసింది. కానీ, మధ్యాహ్నానికి వాతావరణం మారిపోయింది. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల ఉత్సాహం తగ్గిపోవడం, ఫలితాలను మార్కెట్లు ఇప్పటికే గ్రహించినందున ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో లాభాల నుంచి మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. 

టాటా మోటార్స్‌కు తీవ్ర నష్టాలు 
ఆటో, టెలికం, మెటల్, టెక్నాలజీ, బ్యాంకింగ్‌ రంగ స్టాక్స్‌ ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌ షేరు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంది. సోమవారం కంపెనీ ప్రకటించిన ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి. కంపెనీ లాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం క్షీణించడంతో, ఈ స్టాక్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్‌ఈలో 7 శాతానికి పైగా నష్టపోయి 176.60 వద్ద క్లోజయింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 7 శాతం నష్టపోయింది. అలాగే, మారుతి సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌ షేర్లు 3 శాతం వరకు పడిపోయాయి. మరోవైపు ఆర్‌ఐఎల్, హెచ్‌యూఎల్, బజాజ్‌ ఫైనాన్స్‌ మాత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రధాన సూచీలకు అనుగుణంగానే మిడ్, స్మాల్‌క్యాప్‌ సూచీలు నష్టాలను చూవిచూశాయి. రూపాయి కేవలం రెండు పైసల లాభంతో 69.72 వద్ద స్థిరపడింది. బ్రెంట్‌ క్రూడ్‌సైతం ఏ మార్పు లేకుండా 72 డాలర్ల వద్ద ఉంది. 

పోల్స్‌ నిజమైతే తదుపరి ర్యాలీ 
‘‘ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు చేసుకున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు ఉంటే ఈ ర్యాలీ కొనసాగుతుంది. నాణ్యమైన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపిస్తాయి. అలాగే, ఆర్థిక సంస్కరణలు, ఎర్నింగ్స్‌లో వృద్ధి వంటి అంశాల తోడ్పాటుతో స్వల్పకాలంలో మార్కెట్లకు రక్షణ ఉంటుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ.199కే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ విడుదలపై క్లారిటీ

వరుస నష్టాలకు చెక్‌ : స్టాక్‌మార్కెట్లో కళ కళ

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

ఎగవేతదారులను వదలొద్దు

బ్యాంకింగ్‌ ‘బాండ్‌’!

‘ఇన్నోవేషన్‌’లో భారత్‌కు 52వ ర్యాంకు

హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!

ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్‌

అమెజాన్‌కు షాక్‌: నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్లాన్‌

10 వేల ఉద్యోగాలకు ఎసరు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

భారత పారిశ్రామికవేత్త అరెస్ట్‌

ఆర్‌బీఐ ‘ఉత్కర్ష్‌ 2022’

నిలిచిపోయిన ముకేశ్‌ డీల్‌..!

కంపెనీలకు డేటా చోరీ కష్టాలు

‘59 మినిట్స్‌’తో రూ. 5 కోట్లు!

తగ్గిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు

ఫ్లాట్‌ ప్రారంభం : 38 వేల ఎగువకు సెన్సెక్స్‌

38వేల దిగువకు సెన్సెక్స్‌

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

హైదరాబాద్‌లో పేపాల్‌ టెక్‌ సెంటర్‌

జగన్‌! మీరు యువతకు స్ఫూర్తి

బీఎస్ఎన్‌ఎల్‌ స్టార్‌ మెంబర్‌షిప్‌ @498

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

2018–2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

హ్యుందాయ్‌ కార్ల ధరలు మరింత ప్రియం

జీడీపీ వృద్ధి రేటు ‘కట్‌’కట!

ఫార్చూన్‌ ఇండియా 500లో ఆర్‌ఐఎల్‌ టాప్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!