భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

18 Feb, 2019 14:41 IST|Sakshi

సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా సంకేతాలు సానుకూలంగా  ఉన్నప్పటికీ,  దేశీయంగా పుల్వామా ఉగ్రదాడి ఆందోళన నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు భారీగా పతన మవుతున్నాయి.  మిడ్‌ సెషన్‌ తరువాత  పుంజుకున్న అమ్మకాలతో సెన్సెక్స్‌ 263 పాయింట్లు క్షీణించి 35,545 వద్ద,  నిఫ్టీ సైతం 80 పాయింట్ల వెనకడుగుతో 10,644వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 10650 వద్ద కీలక మద‍్దతు ఉందని , ఈ స్థయికి దిగువన ముగిస్తే మరింత బలహీన సంకేతమని ఎనలిస్టులు చెపుతున్నారు. ప్రధానంగా  ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆటో, ఫార్మా రంగాలు నష్టపోతున్నాయి. మరోవైపు రియల్టీ   లాభపడుతోంది.

ఏషియన్‌ పెయింట్స్‌, యస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌,  టీసీఎస్‌, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, గెయిల్‌, బజాజ్ ఆటో టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  రియల్టీ స్టాక్స్‌లో ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, సన్‌టెక్‌  టాప్‌ లాభాల్లోఉన్నాయి.   ఇంకా, జీ, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌బీఐ   కూడా లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు