నష్టాల ముగింపు : మద్దతు స్థాయిలకు దిగువకు

31 Jan, 2020 17:57 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు  వరుసగా  రెండో రోజు నష్టాలతో ముగిసాయి.  అటు ఆర్థిక సర్వే,  ఇటు ఆర్థిక బడ్జెట్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగింది. దీంతోరోజంతా లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిస లాడిన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 40,723 వద్ద,  నిఫ్టీ 74 పాయింట్ల  నష్టంతో 11,963 వద్ద స్థిరపడింది.  తద్వారా సెన్సెక్స్‌,నిఫ్టీ ప్రధాన మద్దతుస్థాయిలకు దిగువ ముగిసాయి. ప్రధానంగా మెటల్‌, ఫార్మా, ఆటో, ఐటీ రంగాలు  బలహీనంగా ముగియగా,  రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ లాభపడ్డాయి.  టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గెయిల్‌  టాప్‌  లూజర్స్‌గా నిలవగా,  కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, టైటన్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హీరో​మోటో, యస్‌ బ్యాంక్‌ లాభ పడ్డాయి. కాగా  వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 6-6.5 శాతం పరిధిలో ఉంటుందని సర్వే అంచనా వేసింది.

మరిన్ని వార్తలు