వారాంతంలో బలహీనం 

14 Feb, 2020 16:51 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిసాయి.  ఆరంభం లాభాలనుంచి 200 పాయింట్ల వరకూ ఎగిసింది. అయితే  ఏజీఆర్‌ బకాయిలపై దేశీయ టెలికం కంపెనీలపై  సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌  షేర్లు, టెలికాం షేర్లతోపాటు, మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ  షేర్లలో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో సెన్సెక్స్‌ 202 పాయింట్లు క్షీణించి 412 58 నిఫ్టీ  61 పాయింట్లు నీరసించి 12,113 వద్ద స్థిరపడింది.  నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్‌, ఐషర్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, హీరోమోటో, కోల్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం  టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు యస్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ, జీ, ఆర్‌ఐఎల్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో  టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. 

మరిన్ని వార్తలు