నష్టాల్లో మార్కెట్లు, బ్యాంక్స్‌, మెటల్‌, ఆటో డౌన్‌ 

22 Jan, 2020 14:48 IST|Sakshi

సాక్షి,ముంబై:  లాభాల్లోంచి  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌  డే హై నుంచి ఒక దశలో 366 పాయింట్లు కుప్పకూలింది. ప్రస్తుతం 230 పాయింట్ల నష్టంతో 41093 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 12100 వద్ద కొనసాగుతోంది.  దాదాపు అన్ని షేర్లు నష్టపోతున్నాయి.  ఆటో, మెటల్‌,  బ్యాంకింగ్‌ షేర్లు నష్టాలను మార్కెట్లనుప్రభావితం చేస్తుండగా, ఐటీ షేర్లు లాభపడుతున్నాయి.  గ్రాసిం, జీ, నెస్లే, హెచ్‌సీఎల్‌టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస​, అదానీ పోర్ట్స్‌, యస్‌ బ్యాంకు ఐవోసీ లాభపడుతున్నాయి. ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, టాటామోటార్స్‌, కోటక్‌మహీంద్ర,పవర్‌గ్రిడ్‌ మారుతి, యూపీఎల్‌ నష్ట పోతున్నాయి. 

>
మరిన్ని వార్తలు