ఫార్మా దెబ్బ: నష్టాల ముగింపు

10 May, 2018 16:41 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో సానుకూలంగా మొదలైనా రోజంతా లాభ నష్టాల మధ్య  ఊగిసలాడి చివరికి నష్టాలతో ముగిశాయి.   సెన్సెక్స్‌ 73 పాయింట్లు క్షీణించి 35,246 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు తక్కువగా 10,716 వద్ద  ముగిశాయి.ఫార్మా, రియల్టీ , ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్‌ రంగాలు ప్రధానంగా నష్టపోయాయి.  అయితే ఆయిల్‌  అండ్‌ గ్యాస్‌, ఐటీ షేర్లు బలపడ్డాయి. 

డాక్టర్‌ రెడ్డీస్‌,  సిప్లా, అరబిందో టాప్‌ లూజర్స్‌గానిలవగా ఐబీ హౌసింగ్‌, టాటామోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌,  ఇన్ఫ్రాటెల్‌, టాటా స్టీల్  నష్టపోగా, ఓఎన్‌జీసీ, ఎయిర్‌టెల్‌, టెక మహీంద్రా, బీపీసీఎల్‌, ఐషర్‌, హిందాల్కో, కోల్‌ ఇండియా, అల్ట్రాటెక్‌, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  లాభాల్లో ముగిశాయి. అటు కరెన్సీ మార్కెట్‌లో  రూపాయి 0.01పైసలు  బలపడి 67.27వద్ద ముగిసింది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో పుత్తడి పది గ్రా స్వల్పంగా లాభపడి 31,322వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు