వారాంతంలో లాభాల కళ, కానీ

20 Mar, 2020 15:58 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో లాభాలతో మురిపించాయి. ఆరంభం నుంచి లాభ నష్టాల తీవ్రంగా ఊగిసలాడిన కీలక సూచీలు చివరికి లాభాల ముగింపు నిచ్చాయి. సెన్సెక్స్‌ 1627 పాయింట్లు ఎగిసి 29915 వద్ద, నిప్టీ 482 పాయింట్ల లాభంతో 8745 వద్ద ముగిసాయి.  బ్యాంకింగ్‌ సహా అన్ని రంగాల షేర్లు లాభాలతో ముగిసాయి. ఓఎన్‌జీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌; టీసీఎస్‌, ఆసియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌,  ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌,  బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌, పవర్‌ గ్రిడ్‌  లాభపడ్డాయి.  మరోవైపు యస్‌బ్యాంకు తదితర షేర్లు నష్టపోయాయి.

అయితే కోవిడ్‌ భయాలతో విలవిల్లాడిన స్టాక్‌మార్కెట్లు ఈ వారంలో భారీ పతనాన్ని నమోదు చేశాయి. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర‍్ల సంపద  హారతి కర్పూరంలా కరిగిపోయింది. పలు కంపెనీల షేర్లు రికార్డు కనిష్టానికి పడిపోయాయి. శుక్రవారం మినహా, గత నాలుగు సెషన్లుగా భారీగా నష్టపోయాయి. దీంతో ఈ వారంలో 12 శాతం నష్టపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు