నష్టాలకు చెక్‌ :  చివరికి లాభాలు

7 Jun, 2019 15:58 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆరంభంలో బలహీనంగా దేశీయ స్టాక్‌మార్కెట్ల చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా హెచ్చు తగ్గులకు లోనవుతూ ఒక దశలో 100 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి   సెన్సెక్స్‌ 86  పాయింట్లు  ఎగిసి 39,616వద్ద నిఫ్టీ 27 పాయింట్ల  లాభానికి పరిమితమై11,871 వద్ద  స్థిరంగా ముగియడం విశేషం. తద్వారా రెండు రోజుల నష్టాలకు చెక్‌ చెప్పిన సూచీలు  వారాంతంలో పాజిటివ్‌గా నోట్‌తో ముగిసాయి. 

ఫార్మా,  మీడియా,  పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో నష్టపోగా, ఐటీ  బలపడింది. అయితే చివరలో కొనుగోళ్లు కనిపించాయి. ఎస్‌బీఐ,  హెచ్‌డీఎఫ్‌సీ,  ఐసీఐసీఐ లాభపడ్డాయి.  ఇన్‌ప్రాటెల్‌, బీపీసీఎల్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, ఎయిర్‌టెల్‌, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌  లాభపడ్డాయి. మరోవైపు రిలయన్స్‌  పవర్‌ గ్రిడ్‌, యాక్సిస్‌, ఎస్‌ బ్యాంకు  డాక్టర్‌ రెడ్డీస్‌, ఐబీ హౌసింగ్‌, గెయిల్‌, సిప్లా, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ క్షీణించాయి. 
 

మరిన్ని వార్తలు