ఫ్లాట్‌ ముగింపు : బ్యాంక్స్‌ జూమ్‌

25 Oct, 2019 16:50 IST|Sakshi

సాక్షి, ముంబై: లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట మధ్య రోజంతా కొనసాగిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్‌ 38 పాయింట్లు లాభంతో 39,058 వద్ద  నిఫ్టీ ఒక పాయింటు నామమాత్రపు లాభంతో 11,584 వద్ద  ముగిసింది. మొత్తానికి సెన్సెక్స్‌ 39వేల ఎగువన, నిఫ్టీ 11500కిపైన స్థిరపడ్డాయి.  ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3.4 శాతం జంప్‌చేయగా, ఐటీ 0.8 శాతం ఎగసింది. మరోవైపు మెటల్‌, ఆటో  నీరసించాయి.  

క్యూ2 ఫలితాలతో ఎస్‌బీఐ  8శాతాని కిపైగా లాభపడగా,  యస్‌బ్యాంక్‌ 11 శాతం జంప్‌  చేసింది. ఇంకా ఐసీఐసీఐ, సిప్లా, సన్‌ఫార్మా, బీపీసీఎల్‌, టీసీఎస్‌, ఐషర్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ ,మారుతి సుజుకి, భారతి ఎయిర్‌టెల​, టాటా స్టీల్‌ లాభాల్లో ముగిసాయి. ఇన్ఫ్రాటెల్‌ 8.6 శాతం, టాటా మోటార్స్‌, టైటన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌, వేదాంతా,  హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హీరో మోటో  నష్టాల్లో ముగిసాయి. మరోవైపు దీపావళి  సందర్భంగా  ఆదివారం సాయంత్రం గంటపాటు సంవత్‌ 2076  స్పెషల్‌ మూరత్‌ ట్రేడింగ్‌  నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు