రోజంతా వెలవెల బోయిన సూచీలు

7 May, 2020 16:10 IST|Sakshi

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

9200 పాయింట్ల  దిగువన ముగిసిన నిఫ్టీ

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది.  ఆరంభం నుంచి చివరి దాకా రోజంతా నష్టాలమధ్య కదలాడిన సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 31443 వద్ద,  నిఫ్టీ 50 ఇండెక్స్ 72 పాయింట్లు బలహీనపడి 9199 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంకు 203  పాయింట్లు కోల్పోయి 19492 వద్ద స్థిరపడింది.  (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ)

ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్స్  భారీగా నష్టపోగా, మిగతా అన్ని రంగాల షేర్లు  ఫ్లాట్‌గా ముగిశాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎం అండ్ ఎం ఈ రోజు నిఫ్టీ 50 టాప్ గెయినర్‌గా నిలిచాయి. రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, ఓఎన్‌జీసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, గెయిల్ ఇండెక్స్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటకీ హెచ్ సీఎల్ టెక్ గైడెన్స్ మిస్ చేయడంతో  డే హై నుంచి 6 శాతం నష్టపోయింది.  అలాగే  ఆశ్యర్యకర ఫలితాలతో యస్ బ్యాంకు 7 శాతం లాభపడింది. ఇంట్రాడేలో  ఇది 20 శాతం ఎగిసింది.  కాగా  బుద్ధ పూర్ణిమ సందర్భంగా మనీ మార్కెట్లకు సెలవు.  (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత) (నష్టాల్లో మార్కెట్ : యస్ బ్యాంకు జంప్)

>
మరిన్ని వార్తలు