లాభాల స్వీకరణ : 41వేల దిగువకు సెన్సెక్స్‌

26 Nov, 2019 16:05 IST|Sakshi


సాక్షి, ముంబై:  స్టాక్‌మార్కెట్లు  నష్టాలతో ముగిసాయి. ఆరంభలాభాలతో సెన్సెక్స్‌ 41 వేల  రికార్డు స్థాయిని అధిగమించింది. భారత మార్కెట్లు ఈ రోజు కొత్త మైలురాళ్లను తాకినప్పటికీ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయి. సెనెక్స్‌ 41,120 వద్ద, నిఫ్టీ 12,132  ఆల్‌టైం రికార్డు గరిష్టాలను నమోదు చేశాయి. అటు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 31,813.70 వద్ద నూతన ఆల్‌టైంకి చేరుకుంది.  అయితే మిడ్‌ సెషన్‌ తరువాత ట్రేడర్ల  లాభాల స్వీకరణతో సూచీలు ఒడిదుడుకుల ధోరణితో కొనసాగాయి. 

ఐటి హెవీవెయిట్స్‌లో కొంత అమ్మకపు ఒత్తిడితో  చివరికి సెన్సెక్స్‌ 68 పాయింట్ల నష్టంతో 40821 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు  నష్టపోయి 12037 వద్ద ముగిసింది. తద్వారా సెన్సెక్స్‌ 41 వేల స్థాయి, నిప్టీ 12050 స్థాయి దిగువకు చేరాయి. జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర రాజీనామాతో జీ షేర్లు కుప్పకూలగా,  టెలికం కంపెనీలకు కేంద్రం నుంచి  నిరాశ ఎదురు కావడంతో టెలికాం షేర్లు నష్టపోయాయి.  ఐటీ షేర్లలో టీసీఎస్, హెచ్‌సిఎల్ టెక్,  ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా  బలహీనంగా ముగిసాయి.  వీటితో పాటు భారతి ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిం, జెఎస్‌ డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫార్మా, బీపీసీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు  ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌,  ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ,  హీరో మోటో, రిలయన్స్‌, ఐటీసీ, టాటా స్టీల్‌ లాభాల్లో ముగిసాయి.

>
మరిన్ని వార్తలు