లాభాల స్వీకరణ : 500 పాయింట్లు ఢమాల్

24 Jun, 2020 14:56 IST|Sakshi

35 వేల దిగువకు సెన్సెక్స్ 

10400 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభ లాభాలనుంచి నష్టాల్లోకి మళ్లాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 516 పాయింట్లు కోల్పోయి 34914 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 10315 వద్ద కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫార్మా సెక్టార్ల నష్టాలతో నిఫ్టీ బ్యాంకు ఏకంగా 700 పాయింట్లు కోల్పోయింది. ఆరంభ లాభాల నుంచి మిడ్ సెషన్ తరువాత అమ్మకాలు జోరు కొనసాగింది. దీంతో నిఫ్టీ 10400 దిగువకు చేరింది.  ఇంట్రా డేలో నిఫ్టీ 10520 స్థాయిని టచ్  చేసింది.  అటు సెన్సెక్స్ 35 వేల స్థాయిని కోల్పోయింది. మరోవైపు గురువారం(రేపు) డెరివేటివ్ సిరీస్ ముగియనుంది. దీంతో  ట్రేడర్ల అప్రమత్తత కొనసాగుతోందన్నారు.

దాదాపు అన్ని రంగాల షేర్లలోను లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఫార్మా, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. మరోవైపు ఎఫ్‌ఎంసిజి టాప్ గెయినర్ గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ ,  హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌ భారీగా నష్టపోతున్నాయి.  సిప్లా,  గ్లెన్ మార్క్, అల్కెం, అరబిందో, డా. రెడ్డీస్,  సన్ ఫార్మ, టొరంటో ఫార్మ,  దివీస్  తదితర ఫార్మ రంగ షేర్లన్నీ కుప్పకూలాయి. దీంతో నిఫ్టీ పార్మ దాదాపు 2 శాతం నష్టపోయింది.  అటు ఆసియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్‌డిఎఫ్‌సీ, టీసీఎస్ లాభపడుతున్నాయి.

చదవండి : కరోనా : బంగారం మరో రికార్డు

మరిన్ని వార్తలు