టెలికాం షాక్‌, నాలుగో రోజు నష్టాలు

18 Feb, 2020 16:04 IST|Sakshi

కన్సాలిడేషన్ బాట‌, ఆఖరి గంటలో కొనుగోళ్ల ఊతం

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు కన్సాలిడేషన​ బాట పట్టాయి. ఒక దశలో ఇంట్రాడేలో 445పాయింట్లు కుప్పకూలిన కీలక సూచీలు చివర్లో తేరుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 161 పాయింట్లు 40894 వద్ద స్థిరపడగా, నిఫ్టీ  53 పాయింట్లు నష్టంతో 11992 వద్ద  ముగిసింది. దీంతో కీలక సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టపోగా, మంగళవారం నిఫ్టీ 12వేలకు దిగువకు చేరడం గమనార్హం. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.56 శాతం నష్టపోగా, బ్యాంకింగ్ గేజ్ నిఫ్టీ బ్యాంక్ 0.39 శాతం క్షీణించింది. ఐటీ,  ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు ఆఖరి గంటలో గణనీయంగా పుంజుకోవడం భారీ నష్టాలనుంచి దలాల్‌ స్ట్రీట్‌ కోలుకుంది.  అటు ఏజీఆర్‌ వివాదంతో కుదైలన టెలికాం షేర్ల షాక్‌ బాగా తగిలింది.భారతి ఇన్‌ఫ్రాటెల్, యెస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో టాప్‌ లూజర్స్‌గా నిలవగా, హెచ్‌డిఎఫ్‌సీ, రిలయన్స్, భారతి ఎయిర్‌టెల్  నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. బీపీసీఎల్‌, జీ ఎంటర్‌ టైన్‌మెంట్‌,  కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, ఐషర్‌ మోటార్స్‌, గెయిల్‌, టీసీఎస్‌ లాభపడ్డాయి. దీనికితోడు ప్రపంచవ్యాపంగా  కరోనా వైరస్‌ మహమ్మారి ఆర్థిక మందగమనానికి కారణమవుతుందన్న ఆందోళర ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది.

మరిన్ని వార్తలు