జోరుగా స్టాక్‌మార్కెట్లు

30 May, 2019 14:45 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరుగా కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కేంద్రంలో కొలువు దీరనున్న నేపథ్యంలో కీలక సూచీలు  భారీగా జంప్‌ చేశాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్  నాలుగు వందల పాయింట్ల లాభాలకు చేరువలో ఉంది. 378 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ 39,886 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు పురోగమించి 11,970 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ జీడీపీ మందగించవచ్చన్న ఆందోళనలు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోందని విశ్లేషకుల అంచనా.  మరోవైపు  ఎఫ్‌ అండ్‌ వో సిరీస్‌  ఈ రోజు ముగియనుంది.

ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1 శాతం చొప్పున లాభపడగా, ఆటో, మెటల్ 0.5 శాతం డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, ఎయిర్‌టెల్‌, యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, ఆర్‌ఐఎల్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్, ఇన్ఫోసిస్‌ 3.2-1.2 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్‌ ఫార్మా, ఐషర్, ఎంఅండ్‌ఎం, జీ, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, సిప్లా, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్‌ఫ్రాటెల్‌ 2-0.7 శాతం మధ్య క్షీణించాయి. 

మరిన్ని వార్తలు