నష్టాల్లో సూచీలు : మెటల్‌,  బ్యాంక్స్‌ డౌన్‌

29 May, 2019 14:02 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై సందేహాలతో అమెరికా, ఆసియా మార్కెట్లు డీలాపడటంతో  దేశీయంగా ఇన్వెస్టర్లు  లాభాల స్వీకరణకు మొగ్గు  చూపుతున్నారు.  దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 152 పాయింట్లు క్షీణించి 39,596 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 11,881 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సెన్సెక్స్‌, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల దిగువకు చేరాయి. 

ఐటీ స్వల్పంగా పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2 శాతం, ఆటో, మెటల్‌ 1.2 శాతం స్థాయిలో క్షీణించాయి. ప్రభుత్వ బ్యాంక్స్‌లో పీఎన్‌బీ, ఎస్‌బీఐ, అలహాబాద్‌ బ్యాంక్‌, బీవోబీ, ఓబీసీ, కెనరా, బీవోఐ, యూనియన్‌ బ్యాంక్‌ నష్టపోతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్‌, విప్రో, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా, సన్ ఫార్మా, యస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఎం అండ్‌ ఎం  2.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, ఐబీ హౌసింగ్‌, యూపీఎల్‌, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్‌  నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు