ట్రేడ్‌ వార్‌ భయాలు : స్టాక్‌మార్కెట్ల పతనం

17 Jun, 2019 13:10 IST|Sakshi

భారత్‌ - అమెరికా ట్రేడ్‌వార్‌ భయాలు

రిలయన్స్‌, యాక్సిస్‌  ఎల్‌ అండ్‌ టీ  లాంటి బ్లూ చిప్స్‌ పతనం

340 పైగా పాయింట్లు నష‍్టపోయిన స్టాక్‌మార్కెట్లు 

టైర్ల షేర్లు లాభాలు

సాక్షి, ముంబై : నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు ఏకోశానా కోలుకోలేదు. భారత్‌ అమెరికా వాణిజ్య యుద్ధ భయాలతో ఆరంభంనుంచీ ట్రేడర్ల అమ్మకాల ఊపందుకున్నాయి. అనంతరం మరింత పెరిగిన అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌  340 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 100పాయింట్లకు పైగా పతనమై 11800 స్థాయిని కోల్పోయింది. భారత్ అమెరికాపై ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధ భయాన్ని సృష్టిస్తోందని  మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్‌కు చెందిన సిద్ధార్థ ఖేమ్కా  పేర్కొన్నారు.  మెటల్‌, రియల్టీ, బ్యాంకింగ్‌ ఇలా దాదాపు  అన్ని రంగాలు  నష్టపోతున్నాయి.  ప్రధానంగా రిలయన్స్‌, యాక్సిస్‌  ఎల్‌ అండ్‌ టీ,  హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐటీసీ, మారుతి సుజుకి నష్టాలు మార్కెట్లను  పడగొడుతున్నాయి.

ఇంకా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.9 శాతం పడిపోయింది, జేఎస్‌డబ్ల్యు స్టీల్  టాటా స్టీల్ వరుసగా 3.3, 2.5 శాతం  నష్టపోతున్నాయి. రియల్టీ కౌంటర్లలో సన్‌టెక్‌, డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌, ఒబెరాయ్‌ 3.7-1.7 శాతం మధ్య నష్ట పోతున్నాయి. ఇంకా జెట్ ఎయిర్‌వేస్  తాజాగా  16 శాతానికి పైగా పడిపోయింది.  సెయిల్‌,  వేదాంతా, జైన్‌ ఇరిగేషన్, హిందాల్కో 4.4-1.7 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు ఎస్‌బ్యాంకు, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, జీ, విప్రో స్వల్పం లాభపడుతున్నాయి. దీంతోపాటు ఎంఆర్‌ఎఫ్‌, సియట్‌, అపోలో లాంటి టైర్ల షేర్లు లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు